పరిస్థితి అదుపుతప్పుతోంది... ఇక గొలుసులతో కట్టేయాల్సిందే: విజయసాయిరెడ్డి

  • చంద్రబాబుపై ట్విట్టర్ లో విసుర్లు
  • బాధితుల చికిత్సకు బయటి నిపుణులను రప్పించాలంటున్నాడని విమర్శలు
  • నోటికొచ్చింది పేలుతున్నాడంటూ వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందించారు. "స్టైరీన్ గ్యాస్ అంటే ఏమిటో జ్ఞానినైన తనకే అంతుబట్టడంలేదని, ఇక ఈ ఐఏఎస్ లకు ఏం తెలుస్తుందని అంటున్నాడు. బాధితులకు చికిత్స కోసం బయటి నుంచి నిపుణులను రప్పించాలట. మొన్న కూడా ఇంతే, కరోనా వైరస్ కు చికిత్స చేయడానికి ఇక్కడి డాక్టర్లకేం తెలుసని పేలాడు. చూస్తుంటే పరిస్థితి అదుపుతప్పుతున్నట్టు కనిపిస్తోంది... ఇక గొలుసులతో కట్టేయాల్సిందే" అని వ్యంగ్యం ప్రదర్శించారు.

Vijay Sai Reddy
Chandrababu
Styrene Gas
IAS
Corona Virus
Doctors

More Telugu News